ఎంత వరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
చరణం1:
కనపడేవెన్నెన్ని కెరటాలుకలగలిపి సముద్రమంటారుఅడగరేం ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతి వారుమనిషనే సంద్రాన కెరటాలుపలకరే మనిషి అంటే ఎవరు
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు
నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
చరణం2:
మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి భాష్యం
పుటకా చావు రెండే రెండూ నీకవి సొంతం కావు, పోనీ
జీవిత కాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానియ్యి
Hats off to Guruvugaru ............
Thursday, May 15, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Bava, life lo okkasarina
gurugari to matladali ra
ayana alochanalaki, raatalki spoorthi ela vastundi telusukovali ra
Extraordinary
Post a Comment